Aadi Srinivas: చాలెంజ్ లు విసిరి పారిపోయిన సంస్కృతి మీది.. కేటీఆర్ పై ఆదిశ్రీనివాస్ ఫైర్

by Prasad Jukanti |

కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ ఫైర్ అయ్యారు.

Aadi Srinivas: చాలెంజ్ లు విసిరి పారిపోయిన సంస్కృతి మీది.. కేటీఆర్ పై ఆదిశ్రీనివాస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ కు ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు (Formula -E car Race) భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) విమర్శించారు. కేటీఆర్ (KTR) కు దమ్ముంటే విచారణకు హాజరై నిజాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధం అని నువ్వు సిద్ధమేనా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ చేయడంపై ఆది శ్రీనివాస్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. చాలెంజ్ లు విసిరి వెనక్కి వెళ్లే సంస్కృతి మీది అని దుయ్యబట్టారు. గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారన్నారు. గతంలో డ్రగ్స్ టెస్టుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే పారిపోయింది ఎవరు అని ప్రశ్నించారు. మీరా గొప్పలు చెప్పేది? కేటీఆర్ మాటలు కాదు ఏసీబీ ముందు హాజరై విచారణకు సహకరించాలన్నారు. కేటీఆర్ నోటి నుంచి వస్తున్న బూతుమాటలను తెలంగాణ సమాజం అంతా చూస్తోందన్నారు. ఇప్పుటికే బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు శిక్ష తప్పదన్నారు.

Next Story