మోడీ ఇంటి ముందు బీజేపీ నేతలు ధర్నా చేయాలి

by velandi.Saikiran |

కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మహా ధర్నా చేస్తుందని రామచందర్ రావు చేసిన కామెంట్లకు ప్రభుత్వ

మోడీ ఇంటి ముందు బీజేపీ నేతలు ధర్నా చేయాలి
X

తెలంగాణకు నిధులు ఇవ్వని మోడీ ఇంటి ముందు బీజేపీ నేతలు ధర్నా చేయాలి

మీ చేతకాని తనం వల్లనే తెలంగాణకి నిధులు రావడం లేదు

: ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ మహా ధర్నా చేస్తుందని రామచందర్ రావు చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ మహాధర్నా ఎందుకు చేస్తుంది?..ఏ మొహం పెట్టుకొని బీజేపీ నాయకులు ధర్నా చేస్తారు?..తెలంగాణ కు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారని ధర్నా చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మీరు కేంద్రంలో ఉండి మెట్రోకి అనుమతి ఇచ్చారా? రీజనల్ రింగ్ రోడ్డు కి కు నిధులు ఇచ్చారా? మూసీకి నిధులు ఇచ్చారా? తెలంగాణకు అదనంగా మీరు చేసిన సాయం ఏమిటి? అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో పాటు కేంద్ర ప్రభుత్వం పెద్దలను ఎన్నో సార్లు కలిశారు..కానీ ప్రయోజనం ఏమిటి? అని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

బీజేపీకి తెలంగాణ పైన ప్రేమ ఉంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి మోడీని తీసుకురావాలని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రాజెక్ట్ లను బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలించుకు పోతుంటే నోరెత్తని మీరు మా సీఎంకి వ్యతిరేకంగా ధర్నాలు చేస్తారా? తెలంగాణకు నిధులు ఇవ్వని మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని ఆది శ్రీనివాస్ సూచించారు. మీ చేతకాని తనం వల్లనే తెలంగాణకి నిధులు రావడం లేదని, ఈ చిల్లర ధర్నాలు ఆపి తెలంగాణకు నిధులు తీసుకువచ్చి మాట్లాడాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మూడుసార్లు కేంద్రంలో అధికారం లోకి వచ్చి ఇప్పటి వరకు దేశానికి ఏం చేశారు? అని, రూపాయి విలువ డాలర్ తో పోల్చితే 90 రూపాయలకు చేరిందని విమర్శించారు. బీజేపీ పాలనతో అంతర్జాతీయగా దేశం పరువు పోతోందని, బీసీ రిజర్వేషన్ల బిల్లును ఢిల్లీ లో అడ్డుకున్నది బీజేపీ పార్టీనే అని ఆది శ్రీనివాస్ ఆరోపించారు.

Next Story