Aadi Srinivas: వేములవాడ రాజన్న ఆలయం మూసివేయలేదు

by Gantepaka Srikanth |

వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) పరిశీలించారు.

Aadi Srinivas: వేములవాడ రాజన్న ఆలయం మూసివేయలేదు
X

దిశ, వెబ్‌డెస్క్: వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాస్త్రం ప్రకారమే వేములవాడ ఆలయ(Vemulawada Temple) అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలు కొనసాగుతున్నాయని చెప్పారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌, స్థానిక ప్రజలతో పాటు ఆలయ పరిరక్షణ సమితి సభ్యుల సూచనలు తీసుకున్నామని అన్నారు. ఈరోజు సూచించిన అంశాలను కూడా స్వీకరిస్తామని చెప్పారు. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా పనిచేస్తామని కీలక ప్రకటన చేశారు. రాజన్న ఆలయం మూసివేశామనేది అవాస్తవం.. రాజన్నకు నిత్యపూజలు ఏకాంతంగా జరుగుతాయని వెల్లడించారు. పనులు జరిగే క్రమంలో భక్తుల రక్షణ దృష్ట్యా భీమేశ్వర ఆలయం(Bheemeshwara Temple)లో దర్శనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరోవైపు అంతకుముందు వేములవాడలోని రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల నేపథ్యంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తుల దర్శనాల కోసం భీమేశ్వర స్వామి‌ అలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వామివారికి సమర్పించే ఆర్జిత సేవలు, కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర మొక్కులు చెల్లించుకునేందుకు భీమేశ్వర సన్నిధిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

Next Story