- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Srinivas: మామ అల్లుళ్ల ద్రోహాం బయటపడుతుందనే బీఆర్ఎస్ తికమక: ఆది శ్రీనివాస్
మామ అల్లుళ్ల ద్రోహాం బయటపడుతుందనే బీఆర్ఎస్ ప్రజలను తికమక పెడుతోందని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మామ అల్లుడు గడిచిన పదేళ్లు తెలంగాణ ప్రజలకు చేసిన ద్రోహాన్ని ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజలకు కళ్లకు కట్టినట్లు తేటతెల్లం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రం అబద్ధాలతో ప్రజలకు తికమక పెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మండిపడ్డారు. పదేళ్లు తెలంగాణ సెంటిమెంట్ తో పబ్బం గడిపిన బీఆర్ఎస్ ఇప్పుడు మళ్లీ అదే సెంటిమెంట్ రంగరించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ హైదరాబాద్ లోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ హయాంలో రైతులు అరిగోస పడ్డారని ఆరోపించారు. బనకచర్లను (Banakacharla) బీఆర్ఎస్ వాళ్లే హైలెట్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ప్రాజెక్టును మా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర జల వనరుల శాఖకు లేఖలు కూడా రాసినట్లు గుర్తు చేశారు. బనకచర్ల పాపం అంతా గత ప్రభుత్వానిదేనన్నారు. మామ అల్లుళ్లే చిల్లర పంచాయతీ పెడుతున్నారని బేషన్లు, బేషజాలు లేవని చెప్పింది మీ మామ కేసీఆర్ కాదా హరీశ్ రావు అని ప్రశ్నించారు. కృష్ణా ఆయకట్టుకు గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పింది కేసీఆర్ కాదా అన్నారు. హరీశ్ రావు ఎంత బుకాయించినా ప్రజలు మిమ్మల్నీ తిరస్కరించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రితో చర్చలు జరిపితే చాణిక్య నీతి అదే రేవంత్ రెడ్డి చర్చలు జరిపితే మ్యాచ్ ఫిక్సింగా అని మండిబడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుంటే దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు. బనకచర్ల విషయంలో ఏపీ చర్యలను కేంద్రం అడ్డుకోవాలని, కేంద్రం పట్టించుకోకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ బనకచర్ల ప్రాజెక్టుపై జోక్యం చేసుకోవాలన్నారు.






