- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ విష కౌగిలిలోకి జీవన్‍రెడ్డి.. ఆది శ్రీనివాస్ విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్‍రెడ్డి (Jeevan Reddy) వ్యవహారం హాట్‍టాపిక్‍గా మారింది. కాంగ్రెస్‍కు గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నిన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‍ను (KCR) కలిశారు. ఈ నేపథ్యంలో జీవన్‍రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) విమర్శలు గుప్పించారు. జీవన్ రెడ్డి 4 దశాబ్దాలుగా అండగా నిలిచిన పార్టీని వదిలి కేసీఆర్ విష కౌగిలిలోకి వెళ్లారని విమర్శించారు. జీవన్ రెడ్డి తన ఆత్మాభిమానాన్ని చంపుకుని, తన ఆత్మను చంపుకుని కేసీఆర్‍ను కౌగిలించుకున్నారన్నారు.
వారికి గుర్తుపెట్టుకోవాలి:
కేసీఆర్ విష కౌగిలిలో చిక్కుకుని బలై ఇప్పుడు కనిపించకుండా పోయిన సీనియర్ల నాయకులను జీవన్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఆది శ్రీనివాస్ అన్నారు. కేసీఆర్ రాక్షస, అవినీతి పాలనపైన 10 ఏళ్ల పాటు అలుపెరగని పోరాటం చేశానని చెప్పుకుంటున్న జీవన్ రెడ్డిని దేవుడు ఎలా కలిసి పనిచేయమని పంపిస్తాడు? అవినీతి పరులు, నియంతలతో కలిసి పనిచేయమని ఏ దేవుడైనా చెపుతాడా? రేవంత్ రెడ్డి పోవాలని, కేసీఆర్ రావాలని ఈ రాష్ట్రంలో ఏ సామాన్యుడైనా అన్నాడా? అని నిలదీశారు. కేసీఆర్ అనే చీడ పురుగును తెలంగాణ ప్రజలు వదిలించుకున్నారన్నారు.
ముందు సమాధానం చెప్పి ఆపై మాట్లాడు:
పదేళ్ల నిరంకుశ పాలనకు చెరమగీతం పాడి ప్రజా పాలన తెచ్చుకున్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దని గత రెండేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికలో జనం తీర్పు ఇచ్చారన్నారు. కేసీఆర్‍కు ఇచ్చిన గుండు సున్నాలు, కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వచ్చిన మార్కులు జీవన్ రెడ్డికి తెలియవా? ఈ రాష్ట్రానికి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని ఆయన సొంత బిడ్డ కవితనే చెపుతోంది. ఆమెనే సొంత పార్టీ పెట్టుకుంటోందన్నారు. బీఆర్ఎస్‍తోతో పనిలే ప్రతి తెలంగాణ బిడ్డ కూడా స్పష్టం చేస్తోందని కేసీఆర్ రావాలని తెలంగాణ ప్రజలెవరూ కోరుకోవడం లేదన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్ప చేశాడని జీవన్ రెడ్డి అనేక సార్లు అన్నారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల పితామహుడు కేసీఆర్‍తో జీవన్ రెడ్డి చేతులు ఎలా కలిపారని? ఆది శ్రీనివాస్ నిలదీశారు. గత పదేళ్లలో జరిపిన ఫిరాయింపులపైన కేసీఆర్‍తో బహిరంగ క్షమాపణ చెప్పిస్తారా? ఫిరాయింపుదారులతో నిండిపోయిన బీఆర్ఎస్‍తో కలిసి జీవన్ రెడ్డి ఎలా పనిచేస్తారు? ముందు ప్రజలకు సమాధానం చెప్పి ఆపై జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై మాట్లాడాలన్నారు.






