- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Srinivas: కనీసం నంది అవార్డులను ఇవ్వలేని మీరా మాగురించి మాట్లాడేది?: ఆది శ్రీనివాస్
కనీసం నంది అవార్డులను ఇవ్వలేని మీరా మాగురించి మాట్లాడేది అంటూ హరీశ్ రావుపై ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పదేళ్లు అధికారంలో ఉండి సినీ పరిశ్రమను పట్టించుకోని బీఆర్ఎస్ ఇవాళ సినిమా పరిశ్రమనంతటిని ఉద్దరించినట్లుగా మాట్లాడుతోందని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ (AAdisrinivas) మండిపడ్డారు. థియేటర్ల కంటే తెలంగాణ సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ త్రిల్లర్ సినిమా నడుస్తోందని, సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండానే సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు ఆదిశ్రీనివాస్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసిన ఆయన.. సినీ పరిశ్రమ విషయంలో హరీశ్ రావు చిలక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో కనీసం నంది అవార్డులు కూడాఇవ్వలేదని మీ హాయంలో సినీ నిర్మాతకలు హీరోలకు లబ్ధి చేకూర్చేందుకు టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇచ్చారని ధ్వజమెత్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రి రిలీజ్ షోలకు వచ్చే ఆదాయంలో 20 శాతం వాటా ఇచ్చేలా జీవో తీసుకువచ్చారన్నారు. ఈ ప్రభుత్వం సినీ కార్మికులకు ప్రత్యేక విద్య, వైద్యం ఏర్పాట్లు చేశారన్నారు.






