- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Saidurga Tej: వారి వల్లే నా లవ్ బ్రేకప్.. సోషల్ మీడియాకు ఆధార్ లింక్ చేయాలి: సాయి దుర్గ తేజ్
తనపై సోషల్ మీడియాలో వస్తున్న బూతులను యాక్టర్ సాయి దుర్గ తేజ్ లైవ్ లో చదివి వినిపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా ఖాతాలపై టాలీవుడ్ యాక్టర్ సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) సంచలన వ్యాఖ్యలు చేశారు. పిల్లల ఎక్స్, ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా (Social Media) ఖాతాలకు ఆధార్ కార్డు నంబర్ లింక్ (Aadhaar Link) చేయాలని లేదా పిల్లల పేరెంట్స్ ఫోన్ తో లింక్ చేయాలని కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారని ఆధార్ లింక్ చేయడం వల్ల పిల్లలు, తల్లిదండ్రుల్లో భయం పెరుగుతుందన్నారు. అభయం మాన్ సూన్-25 సదస్సుకు (Abhayam Man Soon-25 Conference) ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్ పలు ఆసక్తిక విషయాలు చర్చించారు. నా ఇన్ స్టా గ్రామ్ లో నన్ను నా కుటుంబాన్ని బూతులు తిడుతుంటారు. నేను పెద్దవాడిని కాబట్టి అర్థం చేసుకోగలని కానీ చిన్నపిల్లలు దీన్ని ఎలా తీసుకుంటారన్నారు. ఈ సందర్భంగా స్టేజీ మీదే ఇన్ స్టాలో తనపై వస్తున్న బూతులను ఇతరుల చేత చదివించారు. సోషల్ మీడియాలో బూతులు పట్ల విచారం వ్యక్తం చేశారు.
మీడియా రచ్చకు ఆమె నన్ను వదిలేసింది:
మీ పెళ్లి ఎప్పుడు అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన సాయి దర్గ తేజ్.. మీడియా చేసిన రచ్చకు నాకు బ్రేకప్ అయిందన్నారు. వాళ్లతో వీళ్లతో నా పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన రకరకాల ప్రచారాలతో నా కాలేజ్ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా బ్యాడ్ బ్రేకప్ అన్నారు. మీడియా కామ్ గా ఉంటే పెళ్లిని నేనే ప్రకటిస్తానని చెప్పారు.






