అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకో! వస్త్రధారణపై మరోసారి వివాదం.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యువతి

by Ramesh Naini |

మహిళల వస్త్రధారణ (women's clothing) మారాలని వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే.

అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకో! వస్త్రధారణపై మరోసారి వివాదం.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన యువతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహిళల వస్త్రధారణ (women's clothing) మారాలని వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. కుర్తీ మోకాళ్ల కింది దాకా ఉండాలి.. చున్నీ ఏది? చున్నీ వేసుకోవాలి.. మోచేతుల దాకా స్లీవ్స్‌ ఉండాలి.. జీన్స్‌ మీదకి టీ షర్ట్‌ వేయొద్దు.. ఆడవాళ్ల వస్త్రధారణ మీద ఇలా అనేక ఆంక్షలు నేటీకి సమాజంలో ఉన్నాయి. ఈ మధ్య చాలా మంది మహిళలు (Trends) ట్రెండ్‌కు తగ్గట్టు దుస్తులను వేసుకుంటున్నారు. అందులో భాగంగా కొంతమంది మహిళలు వివిధ కారణాల వల్ల చున్నీని ‘దుపట్టా’ (Dupattas) ధరించకూడదని నిర్ణయించుకున్నారు. దీనిపై సంప్రదాయవాదుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇటీవల అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకో అని ఒక వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి మహిళల వస్త్రధారణ విషయం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకో’ అనే వారికి ఓ యువతి ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తాజాగా వైరల్ అవుతోంది.

వీడియో యువతి ప్రకారం.. చిన్న వారి నుంచి పెద్ద అంకుల్స్ వరకు అమ్మ బంగారు తల్లి చున్నీ వేసుకోండని మహిళలకు చెబుతున్నారని ఓ యువతి మండిపడింది. అయితే మగవారు పబ్లిక్‌లో రోడ్లపై మూత్ర విసర్జన చేస్తారని, అది ఎంతవరకు న్యాయం అని యువతి ప్రశ్నించింది. కరీంనగర్ బస్‌స్టాప్ వద్ద చాలా మంది పబ్లిక్, మహిళల ముందు సిగ్గు లేకుండా బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని ఆరోపించింది. అమ్మాయిలు చున్నీ వేసుకోకపోతే వచ్చే నష్టం ఏమి లేదని, వారికి నచ్చిన విధంగా డ్రెస్ వేసుకుంటారని చెప్పుకొచ్చింది. అయితే మగవారు బహిరంగ యూరిన్ చేస్తూ పబ్లిక్‌కు ఏమి చూపిస్తున్నారు? అని ప్రశ్నించింది. ఇది ఏం పద్ధతి.. మహిళల వస్త్రధారణపై మాట్లాడేవారు మారాలని, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం బంద్ పెట్టాలని సూచించింది. సమాజంలో ఆడ, మగ సమానత్వం అనేది అందరూ సమానంగా ఉన్నప్పుడే వస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.

చున్నీ వేసుకోవడం, వేసుకోక పోవడం అనేది మహిళల వ్యక్తిగత విషయం అని, ఎవరి ఇష్టానికి తగ్గట్టు వారు చున్నీ వేసుకుంటారని ఓ నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. అయితే చున్నీ అవసరం ఇప్పుడు లేదని, లోదుస్తుల ఆవిష్కరణ దాని అవసరాన్ని తగ్గించిందని, ఆ సౌలభ్యమే ఫ్యాషన్ రంగంలో కొత్త పోకడలకు నాంది పలికిందని ఓ నెటిజన్ తెలిపారు. ‘బహిరంగ మూత్ర విసర్జన కి ఒక్కో మున్సిపాలిటీ లో ఒక్కో విధంగా ఫైన్ ఉంది. గత్యంతరం లేక అత్యవసర పరిస్థితిలో మూత్ర విసర్జన చేస్తారు. మరి సగం సగం బట్టలు ఏ అత్యవసర పరిస్థితిలో వేసుకుంటారో అక్కనే చెప్పాలి’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.

Next Story