- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి’.. ఒకే మండపంలో ఇద్దరికి తాళి కట్టిన యువకుడు
పెళ్లి(Marriage) అనేది ఎవరి జీవితంలో అయినా చాలా పెద్ద విషయం. కొందరు తల్లిదండ్రులు సెట్ చేసిన పెళ్లి చేసుకుంటుండగా, మరి కొందరు లవ్ మ్యారేజ్‌లతో ఒక్కటవుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి(Marriage) అనేది ఎవరి జీవితంలో అయినా చాలా పెద్ద విషయం. కొందరు తల్లిదండ్రులు సెట్ చేసిన పెళ్లి చేసుకుంటుండగా, మరి కొందరు లవ్ మ్యారేజ్‌లతో ఒక్కటవుతున్నారు. అయితే.. పెళ్లి అంటే ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య జరుగడం మనం ఇంతకాలం చూశాం.. కానీ, ఇక్కడ కాస్త వెరైటీగా జరిగింది. తొట్టెంపూడి వేణు- శ్రీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీకృష్ణ 2006 సినిమా(Sri Krishna 2006 Movie) స్టోరీ రిపీట్ అయింది. ఒకే మండపంలో ఓ యువకుడు ఇద్దరి యువతులకు తాళి కట్టాడు. ఈ ఘటన కొమరం భీమ్ ఆసిఫాబాద్(Kumuram Bheem Asifabad) జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. సూర్యదేవ్ అనే యువకుడిని.. జల్కర్ దేవి, లాల్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలు ప్రేమించారు. ఇద్దరూ అతనే కావాలని పట్టుబట్టారు. పెళ్లంటూ చేసుకుంటే.. అతన్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. ముగ్గురు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని పెద్దలకు వివరించారు. చేసేదేమీ లేక వారికి పెద్దలు పెళ్లి చేసి ఆశీర్వదించారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించడం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు ఈ వివాహ పత్రికను, పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అవి కాస్త వైరల్‌గా మారాయి. దీంతో నెటిజన్లంతా ఆ యువకుడ్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. ‘ఏం గుండెరా వాడిది.. ఆ గుండె బతకాలి’ అంటూ ప్రభాస్ మిర్చీ సినిమాలోని డైలాగులతో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రేమించిన వాడిని వదులుకోలేక.. ఆ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాన్ని సైతం అభినందిస్తున్నారు.
ఒకే మండపంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు
— Telugu Scribe (@TeluguScribe) March 28, 2025
ఆహ్వాన పత్రికల్లో సైతం ఇద్దరు యువతుల పేర్లు ముద్రించి, ఘనంగా వివాహం చేసుకున్న యువకుడు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకున్న… pic.twitter.com/Tbre507zTB






