మర్మాంగాన్ని కట్ చేసుకున్న యువకుడు.. ప్యాంట్ అంతా రక్తంతో..

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-16 04:44:14  IST  )

ఓ యువకుడు తన మర్మాంగాన్ని కట్ చేసుకున్న అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది.

మర్మాంగాన్ని కట్ చేసుకున్న యువకుడు.. ప్యాంట్ అంతా రక్తంతో..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడు తన మర్మాంగాన్ని కట్ చేసుకున్న అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. విశాఖపట్నం (Vishakhapatnam) నుంచి వచ్చిన 24 ఏళ్ల యువకుడు ఇంట్లో నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి మతిస్థిమితం లేకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం బొబ్బిలి (Bobbili) ఫ్లైఓవర్‌ నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా.. అతను ధరించిన ప్యాంటు నుంచి రక్తస్రావం కావడాన్ని స్థానికులు 108కు సమాచారం అందజేశారు. వారు స్పాట్‌కు చేరుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ శశిభూషణ్‌రావు (Shahibhushan Rao) మాట్లాడుతూ.. యువకుడు చికిత్సకు అసలు సహకరించలేదని అన్నారు. ఇంటి వారి వివరాలు అడిగితే చెప్పేందుకు నిరాకరిస్తూ పారిపోయేందుకు ప్రయత్నించాడని పేర్కొన్నారు. అతడి వద్ద లభ్యమైన ఫోన్ నెంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశామని, మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించినట్లుగా సూపరింటెండెంట్ శశిభూషణ్‌రావు తెలిపారు. అయితే, మర్మాంగాన్ని అతడే కట్ చేసుకున్నాడా.. లేక ఎవరైనా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది.

Read More..

నాలుగు బస్సులకు అంటుకున్న మంటలు.. పలువురు దుర్మరణం!

Next Story