- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ATM Robbery: కోఠిలోని బ్యాంకు ఏటీఎంలో చోరీకి యువకుడి యత్నం..
(ATM Robbery)హైదరాబాద్ కోఠి లోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: (ATM Robbery)హైదరాబాద్ కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు. కోఠిలోని కొటాక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank) ఏటీఎం సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోకపోవడంతో ఏటీఎం మెషిన్‌ను కింద పడేసి ధ్వంసం చేసి అక్కడి నుంచి పరార్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు గౌతమ్ రాజేష్‌గా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడి మద్యం, గంజాయికి బానిసై గౌతమ్ రాజేష్ చోరీలు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. అయితే కొటాక్ (ATM) ఏటీఎంలో సెక్యూరిటీ గార్డు లేకపోవడాన్ని చూసి ఏటీఎం మెషిన్ ఓపెన్ చేసేందుకు గౌతమ్ రాజేష్ ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించిన అది ఓపెన్ కాకపోవడంతో కింద పడేసి ఎస్కేప్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన సీసీ ఫూటేజీ వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది.






