- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు మిస్స్.. దక్కిన ప్రాణాలు
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో నిప్పురవ్వలు రేగి మంటలు వేగంగా వ్యాపించి, బస్సు పూర్తిగా తగలబడడింది. ఈ ఘటనలో 20 మంది బస్సులోనే సజీవ దహనం కాగా మరో నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. అయితే ఇంతటి దారుణ ప్రమాదం నుంచి ఓ యువకుడు తృటిలో తప్పించుకున్నాడు. తరుణ్ అనే యువకుడు U-2 అనే సీట్ రిజర్వ్ చేసుకున్నాడు.
హైదరాబాద్ లోని ప్యారడైజ్ సర్కిల్ పాయింట్ వద్ద బస్సు ఎక్కాల్సి ఉండగా.. అనుకోని కారణాల వల్ల బస్సు కొద్దిలో మిస్స్ అయింది. చేసేదేంలేక తరుణ్ వెనుదిరిగాడు. కాగా కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద అదే బస్సుకు ప్రమాదం జరిగి 20 మంది కాలిబూడిదయ్యారు. బస్సు టిక్కెట్ డబ్బులు పోతే పోయాయి గాని ప్రాణాలు దక్కాయని సదరు యువకుడు ఆనందం వ్యక్తం చేసాడు.






