సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లైయింగ్ కిస్.. ఎగ్జైట్మెంట్‌లో ఇంకేం చేసిందో తెలుసా? (వీడియో)

by Disha Web Desk 2 |
సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లైయింగ్ కిస్.. ఎగ్జైట్మెంట్‌లో ఇంకేం చేసిందో తెలుసా? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యటిస్తున్నారు. యువతకు ఉద్యోగాలు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుబడులు తెచ్చేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుతున్నాడు. మొత్తంగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వార్షిక సమ్మిట్‌లో తెలంగాణకు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. పలు దేశ, విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు కూడా చేసింది.

అయితే, సమ్మిట్ ముగిశాక తనను కలిసేందుకు వచ్చిన తెలుగు వాళ్లను సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. ఈ క్రమంలోనే ఓ యువతి రేవంత్ రెడ్డిని ప్రత్యక్షంగా చూసిన ఆనందంలో ఫ్లైయింగ్ కిస్సులు ఇచ్చింది. సీఎంకు ఫ్లవర్ బొకేతో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆనందంలో డ్యాన్స్ చేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ ఆసక్తికర పరిణామాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పాజిటివ్ కామెంట్లు పెడుతూ రేవంత్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed