Mother's love: అవి కూడా ఫ్యామిలీ మెంబర్స్ యే! కుక్క పిల్లకు దిష్టి తీస్తున్న అమ్మ.. నెటిజన్లు ఫిదా

by Ramesh Naini |   (  Updated:2025-04-26 06:58:53  IST  )

యానిమల్ లవర్స్ పెంపుడు జంతువులను తమ ఫ్యామిలీలో వ్యక్తిలా వాటిని చూసుకుంటారు.

Mothers love: అవి కూడా ఫ్యామిలీ మెంబర్స్ యే! కుక్క పిల్లకు దిష్టి తీస్తున్న అమ్మ.. నెటిజన్లు ఫిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: యానిమల్ లవర్స్ (Animal Lovers) పెంపుడు జంతువులను తమ ఫ్యామిలీలో వ్యక్తిలా వాటిని చూసుకుంటారు. ముఖ్యంగా డాగ్ లవర్స్ (Dog Lovers) విధుల్లో ఉండే కుక్కలకు నిత్యం ఆహారం పెడుతుంటారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు ముద్దు ముద్దు పేర్లు పెట్టుకోని వారు మురిసిపోతుంటారు. కొందరు వాటి ఆహారం కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కుక్కలకు బొట్టు పెట్టి మురిసిపోతారు. బర్త్‌ డే సెలబ్రెషన్స్, శ్రీమంతం, చనిపోతే కర్మకాండ సైతం జరిపించడం కూడా జంతు ప్రేమికులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఒక వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది. (Viral video) వీడియోలో చూపించిన ప్రకారం.. ఇంట్లోకి కొత్తగా తెచ్చుకున్న చిన్న కుక్క పిల్లకి (puppy) అమ్మ దిష్టి తీయడం చేస్తోంది. ఆ క్కుక్క పిల్ల సైతం (Mother) అమ్మ చెప్పినట్లు శ్రద్ధగా కూర్చుని దిష్టి తీయించుకుంటుంది. దిష్టి తీసే సమయంలో ఆ బుజ్జి కుక్క పిల్ల చేసే చేష్టలు చిన్న పిల్లాడి మాదిరి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోకు నెటిజన్‌లు ఫిదా అయ్యారు.

‘ఇలా కూడా చేస్తారా? నేనే అనుకున్నా.. చాలా మందే ఉన్నారు బయట’ అంటూ ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా వీడియో పంచుకున్నారు. దీంతో ఆ వీడియోకి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘అవి కూడా ఫ్యామిలీ మెంబర్స్ యే’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. ‘తెలుగు వాళ్ళంటే సెంటిమెంటల్ పీపుల్స్, ప్రేమిస్తే ప్రాణం ఇచ్చేస్తాం.. అది మనిషి అయినా కుక్క అయినా.. తగ్గేదేలే’ అంటూ మరో నెటిజన్ ఆసక్తికర కామెంట్ పెట్టారు. ఇంట్లోకి కుక్కు పిల్లలను తీసుకొస్తే.. అమ్మలు మొదటగా వారిస్తారు.. తర్వాత వాటిని మనకంటే ఎక్కువగా ప్రేమతో పెంచుతారని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు.

Click For Tweet..

Next Story