- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tragedy Tour : విషాద యాత్రగా మారిన విహార యాత్ర
మహిళా వైద్యుల బృందం(Female Doctors Team) విహార యాత్ర(Excursion Tour) విషాద యాత్ర(Tragedy Tour)గా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: మహిళా వైద్యుల బృందం(Female Doctors Team) విహార యాత్ర(Excursion Tour) విషాద యాత్ర(Tragedy Tour)గా మారి ఓ వైద్యురాలు ప్రాణం తీసుకుంది. మృతురాలు హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువ వైద్యురాలు అనన్య రావు(Young doctor Ananya Rao)స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి నదిలో కొట్టుకుపోయింది. కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నది వద్ద ఈ విషాదం జరిగింది. అనన్య రావు తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కు వెళ్లారు.
అక్కడ పర్యాటక ప్రాంతాల్లో విహరించి.. మంగళవారం రాత్రి నణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారు. బుధవారం మధ్యాహ్నం డాక్టర్ అనన్య రావు సరదాగా ఈత కొట్టేందుకు ఏకంగా 25 అడుగుల ఎత్తు కొండ నుంచి తుంగభద్ర నదిలో దూకి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆ ఉద్ధృతిలో ఆమె కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అనన్య రావు నీళ్లలోకి దూకిన వీడియోలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
సహాయక బృందాలు, గజ ఈతగాళ్లు ఆమెను కాపాడేందుకు రంగంలోకి దిగినా అప్పటికే ఆలస్యమైంది. అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు ఆమె కోసం నిన్నంతా రాత్రి దాకా గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు. డా.మెహన్‌రావు కూతురు అనన్యరావు. ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని సమాచారం.






