Manchu family fight: అతడి వల్లే మంచు ఫ్యామిలీలో తాజా గొడవలు.. సంచలన విషయాలు బయటపెట్టిన పనిమనిషి

by Prasad Jukanti |   (  Updated:2024-12-10 15:44:23  IST  )

మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్న గొడవలపై పనిమనిషి సంచలన విషయాలు బయటపెట్టింది.

Manchu family fight:  అతడి వల్లే మంచు ఫ్యామిలీలో తాజా గొడవలు.. సంచలన విషయాలు బయటపెట్టిన పనిమనిషి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) ఫ్యామిలీలో విభేదాల వ్యవహారంలో కొత్త ట్విస్టులు నమోదవుతున్నాయి. ఇవాళ మంచు విష్ణు (Manchu Vishnu) విదేశాల నుంచి జల్‌పల్లికి చేరుకున్న కొద్ది సేపట్లోనే మంచు మనోజ్ (Manchu Manoj) తన భార్యాబిడ్డలతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో అసలు మంచు ఫ్యామిలీలో గొడవలకు కారణం ఏంటనేది వారి పనిపనిషి బయటపెట్టారు. ఇందుకు సంబంధిచిన వీడియో వైరల్‌ అవుతోంది. మహిళా పనిమనిషి మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం మోహన్ బాబు సిబ్బందిలోని ప్రసాద్ అనే వ్యక్తిని మంచు మనోజ్ బెల్ట్‌తో కొట్టేందుకు వచ్చారు. తన స్టాఫ్‌ను కొట్టవద్దంటూ మనోజ్‌ను మోహన్‌బాబు నెట్టేశారు. దీంతో మోహన్‌బాబుపై మనోజ్ చేయిచేసుకున్నారు. ప్రసాద్ అనే వ్యక్తి సార్ వద్ద నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. ఈ గొడవలో నాకు తెలిసి దెబ్బలు తగలలేదు. కేవలం నెట్టేసుకున్నారంతే. అయితే వీరికి పాతగొడవలున్నాయి. మంచు విష్ణు, మంచు మనోజ్‌కు మధ్య మనస్పర్థలు కూడా ఉన్నాయి. మౌనిక (Maunika)ను మనోజ్ పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదు. మౌనిక మొదటి భర్తకు పుట్టిన కుమారుడు ప్రస్తుతం మనోజ్-మౌనికలతోనే ఉంటున్నాడు. ఈ విషయంలో మొదటి నుంచి మంచు కుటుంబానికి ఈ వ్యవహారం ఇష్టం లేదు. ప్రసాద్ (Prasad) అనే వ్యక్తి కారణంగా మోహన్‌బాబుపై మనోజ్ చేయి చోసుకున్నారు. మంచు లక్ష్మి వచ్చి సముదాయించి వెళ్లారు.’ అని చెప్పుకొచ్చింది

Read More...

Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న హైడ్రామా.. డీజీపీ ఆఫీసుకు మనోజ్


Next Story