నిథమ్‌లో డెస్టినేషన్ తెలంగాణ-రోడ్ అహెడ్స్ థీమ్‌తో పర్యాటక సదస్సు

by Ajay Maddhiboyina |

పర్యాటక రంగానికి దిశానిర్దేశం చేసేందుకు, పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) సిద్ధమైంది.

నిథమ్‌లో డెస్టినేషన్ తెలంగాణ-రోడ్ అహెడ్స్ థీమ్‌తో పర్యాటక సదస్సు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక రంగానికి దిశానిర్దేశం చేసేందుకు, పర్యాటక రంగ అభివృద్ధిలో కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్) సిద్ధమైంది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం గచ్చిబౌలిలోని నిథమ్ ప్రాంగణంలో “డెస్టినేషన్ తెలంగాణ-రోడ్ అహెడ్ అనే థీమ్ తో ప్రతిష్టాత్మక పర్యాటక సదస్సును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు.

ఈ సదస్సులో భాగంగా పర్యాటక రంగానికి సంబంధించిన కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు తెలంగాణ పర్యాటక 'బ్రాండ్ కిట్'ను ఆవిష్కరించనున్నారు. సదస్సులో భాగంగా పర్యాటక రంగ భవిష్యత్తుపై పలు కీలక చర్చలు జరగనున్నాయి. టీసీఎస్ కన్సల్టింగ్ తరుణ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన 'డెస్టినేషన్ తెలంగాణ-రోడ్ అహెడ్' అనే అంశంపై సీఈఓల ప్యానెల్ చర్చ జరగనుంది. ఇందులో ఎఫ్టీసీసీఐ, టీఏఏఐ, అలంకృత రిసార్ట్, వెడ్డింగ్ బై పటవార్, తాజ్ డెక్కన్ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

Next Story