- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెప్పపాటులో ఘోరం జరిగింది.. బస్ కండక్టర్ రోదన
హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి 163 పై (Hyderabad-Bijapur NH 163) మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి 163 పై (Hyderabad-Bijapur NH 163) మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసిందే. ఆర్టీసీ బస్సును మితిమీరిన వేగంతో టిప్పర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 19 మంది మరణించగా పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనలో స్వల్ప గాయాలతో తృటిలో తప్పించుకున్న ఆ బస్ కండక్టర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... మీడియాతో మాట్లాడారు.
బస్సు మీర్జాగూడ వద్దకు రాగానే ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదని, కన్నుమూసి తెరిచేలోపు ఘోరం జరిగిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. బస్సులో పోలీసులు, ఉద్యోగులు సహా మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు దాని కింద కూరుకుపోయారు. ఈ ప్రమాదంలో 19 మంది మృతి చెందగా.. 20 మంది తీవ్రంగా గాయడ్డారు.
READ MORE ...






