- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)కు ఘోర అవమానం(Insult) జరిగింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)కు ఘోర అవమానం(Insult) జరిగింది. ఈ అవమానంపై మంత్రి ఎదుటే అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇంతకీ ఏం జరిగిందంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం(Aswaraopet Constituency)లో నేడు రూ.15 కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana)కు తెలియకుండానే ఈ కార్యక్రమం జరిగింది. దీనిపై సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి కార్యక్రమ స్థలానికి వెళ్ళి అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala NageshwaraRao) హాజరయ్యారు. మంత్రి ముందే ఎమ్మెల్యే ఆదినారాయణ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేను ఉన్నాను అనుకున్నారా? చచ్చాను అనుకున్నారా? అంటూ కఠినంగా మాట్లాడారు. ఈ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేస్తానని.. దీనికి బాధ్యులైన ఏ ఒక్క అధికారిని వదలబోనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకి తుమ్మల ఎంతో నచ్చజెప్పగా ఆయన శాంతించి తదుపరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.






