కొనసాగుతున్న హరీశ్ రావు విచారణ

by Prasad Jukanti |   (  Updated:2026-01-20 10:22:51  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన హరీశ్ రావు నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కొనసాగుతున్న హరీశ్ రావు విచారణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station) ఎదుట ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case)సిట్ విచారణకు హాజరైన హరీశ్ రావు (Harish Rao) మరికాసేపట్లో బయటకు రాబోతున్నారన్న ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా పీఎస్ వైపు దూసుకువచ్చాయి. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

నాలుగున్నర గంటలుగా విచారణ:

మరోవైపు సిట్ ఇచ్చిన నోటీస్ మేరకు ఇవాళ హరీశ్ రావు విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరింగిందన్న ఆరోపణలపై ఆయన్ను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. 160 సీఆర్ పీసీ కింద నిన్న హరీస్ రావుకు నోటీసులు ఇవ్వగా ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ పీఎస్ కు విచారణ నిమిత్తం ఆయన హాజరయ్యారు. దాదాపు నాలుగున్నర గంటల పాటుహరీశ్ రావును సిట్ విచారించి ఆయన స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. విచారణ మధ్యలో హరీశ్ రావు ఇంటి నుంచి భోజనం చెప్పించుకున్నారు.

Next Story