మా రాష్ట్రంలో అమలు చేస్తాం.. ప్రజా భవన్‌‌ని సందర్శించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్‌ బృందం

by Ramesh Naini |

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 మంది డిప్యూటీ కలెక్టర్స్‌ బృందం శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లోని సీఎం ప్రజావాణి కేంద్రాన్ని సందర్శించింది.

మా రాష్ట్రంలో అమలు చేస్తాం.. ప్రజా భవన్‌‌ని సందర్శించిన మధ్యప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్స్‌ బృందం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 24 మంది డిప్యూటీ కలెక్టర్స్‌ బృందం శుక్రవారం మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్‌లోని సీఎం ప్రజావాణి కేంద్రాన్ని సందర్శించింది. కార్యక్రమం అమలు తీరు, ప్రజా సమస్యల పరిష్కార ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించిన వారు, ప్రజలకు చేరువవుతున్న ఈ విధానం తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ప్రతినిధి ఆదిత్య నారాయణ తివారి వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం ప్రజావాణి ఇంచార్జ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్‌లతో డిప్యూటీ కలెక్టర్లు సమావేశమయ్యారు. ప్రజావాణి అమలు విధానం, ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కార దాకా అనుసరించే పద్ధతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. ప్రజా సమస్యలను సమయానుకూలంగా పరిష్కరించడంలో సీఎం ప్రజావాణి వ్యవస్థ చూపుతున్న ప్రభావం తమను ఆకట్టుకుందని, ప్రజా సేవలో ఈ నమూనా ప్రాముఖ్యతగలదిగా భావిస్తున్నామని మధ్య ప్రదేశ్ అధికారులు పేర్కొన్నారు.

Next Story