చర్లపల్లిలో తల్లి బిడ్డల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-01-31 13:48:34  IST  )

చర్లపల్లిలో తల్లి బిడ్డల ఆత్మహత్య.. సూసైడ్ నోట్‍లో సంచలన విషయాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ జిల్లా చర్లపల్లిలో (Cherlapally) రైలు కింద పడి ఒకే కుటుంబానికి (Family Suicide) చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెంగిచర్లకు చెందిన విజయ (35) తన ఇద్దరు పిల్లలు విశాల్(17), చేతన (18) తో కలిసి ఇవాళ తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. సాఫ్ట్ వేర్‍ ఇంజినీర్‍గా పని చేస్తున్న విజయ.. హాస్టల్ లో ఉంటున్న తన ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి మరీ ఆత్మహత్యకు (Mother and Children Suicide) పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ లో విజయ పార్క్ చేసిన కారులో సూసైడ్ లేఖ లభ్యమైంది.

నాతో పాటే నా పిల్లలు:

'నా జీవితం నచ్చట్లేదు.. బతకాలని ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. పిల్లల్ని వదిలి వెళ్లడం నాకు ఇష్టం లేదు. నాతో పాటే పిల్లలను తీసుకువెళ్తున్నా.. క్షమించు అమ్మా' అంటూ రాసి ఉన్న లెటర్ కారులో లభించచింది.విజయ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఏమి లేవని విజయ తల్లి మీడియాతో వెల్లడించారు. విజయ భర్త సురేందర్ రెడ్డి దుబాయ్‍లో ఉంటున్నారని, నాలుగు నెలలుగా ఆయన ఇండియాకు రాలేదని చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు చెబుతున్నట్లు ఫ్యామిలీ అంతా అన్యోన్యంగా ఉంటే విజయ ఇలాంటి డేంజర్ డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అనేది ఇంకా సస్పెన్స్ గానే మారింది. అయితే పోలీసుల దర్యాప్తులో ఈ తల్లీబిడ్డల సూసైడ్ వెనుక ఏం మిస్టరీ తేలబోతోంది అనేది చూడాలి.

Next Story