మరణానికి ముందే పత్రికల్లో ప్రకటనలు.. కావూరు డెత్‍పై సోషల్ మీడియాలో చర్చ

by Prasad Jukanti |   (  Updated:2026-03-11 09:23:03  IST  )

కావూరు సాంబశివరావు మరణానికి ముందే పత్రికల్లో 'ఇక సెలవు' అంటూ వచ్చిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరణానికి ముందే పత్రికల్లో ప్రకటనలు.. కావూరు డెత్‍పై సోషల్ మీడియాలో చర్చ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబశివరావు (82) మృతి చెందారు. వయోభార సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం 11:10 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఐదు సార్లు ఎంపీగా, మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కావూరు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సుపరిచితుడు. అలాంటి సాంబశివరావు మరణానికి ముందే ఇక సెలవు అంటూ ఆయన పేరుతోనే పత్రికల్లో ప్రకటనలు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటన కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది.

మరణంపై స్వయంగా ప్రకటన:

రెండు రోజులుగా కావూరు మృతిపై సోషల్ మీడియాతో పాటు కొన్ని ప్రధాన మీడియా చానల్స్ లో కథనాలు ప్రసారం అయ్యాయి. అయితే వాటిని ఆయన కుటుంబ సభ్యులు ఖండించారు. కావూరుకి చికిత్స కొనసాగుతుందని ప్రకటించారు. దీంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇవాళ కొన్ని ప్రధాన దినపత్రికల్లో మాత్రం ఇక సెలవు మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చింది అంటూ ఫుల్ పేజీ ప్రకటనలు వచ్చాయి. 'ఎనిమిది దశాబ్దాల సంపూర్ణ జీవితం చూసిన నేను, ఈ భౌతిక జీవనానికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైంది అని నమ్ముతాను.అంటూ తన బాల్యం, చదువు, రాజకీయ జీవితం, కుటుంబం, తనకు సహకరించిన ఆప్తులు, తెలుగు ప్రజలు, దేశప్రజలను తలుచుకుంటూ భావోద్వేగంతో కూడిన సందేశం ఆయన పేరుతోనే వెలువడింది.

ఏం జరిగిందంటూ వెతుకులాట:

దినపత్రికల్లో వచ్చిన ఈ ప్రకటన చూసిన తెలుగువారు తెల్లవారడంతోనే అంతా షాక్ తిన్నారు. ఈ ప్రకటన చూసిన వారంతా ఆయన పరిస్థితి ఏంటి అని ఆ పత్రికలను లోపలి పేజీలన్నీ తిరగేశారు. గూగుల్ లో ఆయనకు సంబంధించిన సమాచారం వెతుకులాడారు. అక్కడ ఆయన చనిపోయారని కొన్ని, ఇంకా చికిత్స పొందుతున్నారంటూ రెండు రకాల సమాచారం కనిపించడంతో కావూరు ఇంతకు బ్రతికే ఉన్నారా లేదా మరణించారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇంతలో ఉదయం 11 తర్వాత ఆయన మరణ వార్తను ధృవీకరిస్తూ బంజారాహిల్స్ స్టార్స్ హాస్పిటల్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అక్కినేని బాటలో..:

దీంతో చనిపోవడానికి ముందు అక్కినేని నాగేశ్వరరావు సైతం వీడియో సందేశం పంపించారని ఆయన నుంచి కావూరు ప్రేరణ పొందారా? అందువల్లే ముందుగానే కుటుంబ సభ్యుల చేత కావూరు ఇలా ప్రకటన చేయించారా? లేక తానే ఈ ప్రకటన చేయించి ఇవాళ అకస్మాత్తుగా మరణించారా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈ ప్రకటనపై నెటిజన్లు స్పందిస్తూ ఇదో వింత ప్రకటన అని, చనిపోయే ముందు కొందరు తమ మాటగా చెపుతూ అందరి దగ్గరా సెలవు తీసుకోవాలి అనుకునే కొత్త రకం ట్రెండ్ అని కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు రాజకీయంగా ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Next Story