- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : చిన్న మొక్క నిశబ్దంగా అడవిని సృష్టించగలదు : కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

దిశ, వెబ్ డెస్క్ : హరితహారం(Harithaharam) కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. "ఒక చిన్న మొక్క నిశ్శబ్దంగా మొత్తం అడవిని సృష్టించగలదు. జూలై 3, 2015న ఒక చిన్న ఆలోచనగా ప్రారంభమైన హరితహారం కార్యక్రమం, కేసీఆర్(KCR)నాయకత్వంలో కేవలం ఒక దశాబ్దంలోనే తెలంగాణ(Telangana) రాష్ట్రాన్ని హరిత స్వర్గంగా మార్చింది. ఈ గొప్ప కార్యక్రమం ఒక్క మొక్క లేదా ఒక్క అడవి గురించి మాత్రమే కాదు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో పచ్చదనాన్ని పెంచడం గురించి కూడా.
ఈ ఒక్క దశాబ్దంలోనే తెలంగాణలో గ్రీనరీ 24% నుండి 33%కు పెరిగింది. 19,472 గ్రామ పంచాయతీలు, 143 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నర్సరీలు, గ్రామ ప్రకృతి ఉద్యానవనాలు స్థాపించబడ్డాయి. ఈ రోజున మన రాష్ట్ర అటవీ సాంద్రత 6.85 శాతం. చెట్ల సాంద్రత 14.51 శాతం. మొత్తం గ్రీన్ కవర్ 7.7 శాతానికి పెరిగింది. తెలంగాణలో హరితహారం కార్యక్రమం ద్వారా సాధించిన పర్యావరణ పురోగతిని ఈ అంకెలు నిరూపిస్తున్నాయి. రాష్ట్రాన్ని మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చడంలో ఈ కార్యక్రమం విజయం సాధించి అనడాన్ని తెలుపుతున్నాయి" అంటూ ట్వీట్ చేశారు.






