- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zoo Park Entry Fee : పర్యాటకులకు షాక్.. భారీగా పెరిగిన ఎంట్రీ ఫీజులు
పర్యాటకులకు భారీ షాకిచ్చింది ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : పర్యాటకులకు భారీ షాకిచ్చింది ప్రభుత్వం. బహదూర్‌పురాలో ఉన్న నెహ్రూ జూ పార్కు(Nehru Zoo Park) ఎంట్రీ ఫీజులు(Entry Fees) భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రానున్న వేసవిలో సదర్శకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. చివరిసారిగా 2023 వేసవి కాలంలో టికెట్ల ధరలను పెంచగా.. ఇప్పుడు మరోసారి పెంచాలని జూపార్క్ గవర్నింగ్ బాడీ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన రేట్లు
జూ పార్కులో ప్రస్తుతం సాధారణ రోజుల్లో ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.70, వారాంతంలో రూ.80గా ఉండగా.. మార్చి 1వ తేదీ నుంచి పెద్దలకు రూ.100, పిల్లలకు రూ.50 వసూలు చేయనున్నారు. పిల్లలకు గతంలో రూ.45 గా ఉండేది. ఇక టాయ్ ట్రైన్, బ్యాటరీ వెహికిల్, 11 సీటర్ బ్యాటరీ వెహికిల్ ఎక్స్ క్లూజివ్, ఫిష్ ఆక్వేరియం వంటి వాటి ధరలను మాత్రం పెంచలేదు.
షూటింగులకు సైతం
జూ పార్కులో సినిమా షూటింగు తీయడానికి ఇప్పటివరకు సాధారణ ఫోటోలు, వీడియోలు తీసే కెమెరాకు రూ. 120 ఉండగా దానిని రూ. 150కి పెంచారు. ప్రొఫెషనల్ కెమెరాలకు రూ. 600 ఉండగా దానిని రూ.2500కు పెంచారు. ఇక సినిమా షూటింగ్‌లకు సంబంధించిన కెమెరాలకు రూ. 10 వేలు ఫీజుగా తీసుకోనున్నారు.






