నాన్‍వెజ్ లవర్స్ కు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. త్వరలో కేజీ 400?

by Prasad Jukanti |   (  Updated:2026-05-12 08:58:26  IST  )

తెలంగాణలో చికెన్ ధరలు భగ్గుమంటున్నాయి. ఎండల తీవ్రత కారణంగా ఉత్పత్తి తగ్గడంతో త్వరలో రూ.400 దాటే అవకాశం కనిపిస్తోంది.

నాన్‍వెజ్ లవర్స్ కు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు.. త్వరలో కేజీ 400?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో చికెన్ ధరలు నాన్ వెజ్ లవర్స్ కు షాకిస్తున్నాయి. గత పది రోజుల్లో ఏకంగా కిలో చికెన్ ధర రూ.100 వరకు పెరగడం వినియోగదారులను ఆందోళన కలిగిస్తోంది. వారం క్రితం వరకు హైదరాబాద్ లో కిలో స్కిల్ లెస్ చికెన్ ధర రూ.240 ఉండగా ఇప్పుడు పలు ప్రాంతాల్లో రూ. 350 నుంచి 370 వరకు పలుకుతోంది. ఫామ్‍లలో లైవ్ చికెన్ కేజీ రూ. 170 నుంచి రూ. 180 వరకు ఉండగా గుడ్ల ధరలు డజన్ కు రూ. 72 నుంచి 75 కు చేరుకుంది.

ఫౌల్ట్రీ రంగంపై వేసవి ప్రభావం:

రాష్ట్రంలో పెరిగిపోతున్న ఎండల తీవ్రత ఫౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వడగాల్పుల కారణంగా ఫారాల్లోని కోళ్లు ఒత్తిడికి గురవుతూ ఆహారం సరిగా తీసుకోవడం లేదని, వేటిని తట్టుకోలే పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని ఫౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా డిమాండ్ కు సరిపడ ఉత్పత్తి లేక ధరలు పెరుగుతన్నట్లు చెబుతున్నారు. వీటికి తోడు రవాణా ఖర్చులు సైతం భారంగా మారాయని దాంతో ధరలు పెంచక తప్పడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే కేజీ చికెన్ ధర రూ. 400 మార్క్ ను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చికెన్ ధరలు ఆకాశానంటుతుండటంతో మాంసం ప్రియులు చేపల వైపు మళ్లుతున్నారు.

Next Story