RGV కోసం గాలిస్తున్న పోలీసులు.. సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చినట్లు అనుమానం?

by Gantepaka Srikanth |   (  Updated:2024-11-25 16:28:37  IST  )

ప్రముఖ సినీ నటుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కోసం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు(AP Police) గాలిస్తున్నారు.

RGV కోసం గాలిస్తున్న పోలీసులు.. సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చినట్లు అనుమానం?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కోసం ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు(AP Police) గాలిస్తున్నారు. ఇంట్లో లేరని ఆయన సిబ్బంది సమాచారం ఇవ్వడంతో శంషాబాద్‌లోని పలు ఫామ్‌హౌజ్‌లలో పోలీసులు వెతుకుతున్నారు. రామ్ గోపాల్ వర్మకు టాలీవుడ్‌(Tollywood)కు చెందిన ఓ సీనియర్ నటుడు ఆశ్రయం ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా.. కాంట్రవర్సీలకు కేరాఫ్ అయిన ఆర్జీవీకి ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.

వ్యూహం సినిమా విడుదల సమయంలో ఆయన చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan), నారా లోకేష్‌(Nara Lokesh)లపై సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై ఒంగోలులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒంగోలు నుంచి పోలీసులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. అరెస్ట్ చేసి తీరుతామని ప్రకటించారు. దీంతో ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Read more...

POLICE: ఇచ్చిన అవకాశాన్ని ఆర్జీవీ యూజ్ చేసుకోలేదు.. ఇక అరెస్ట్ ఒక్కటే మార్గం


Next Story