T Congress : టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం

by Muthe.Rajitha |

తెలంగాణ కాంగ్రెస్(T Congress) లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది.

T Congress : టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్(T Congress) లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి(MLA Malreddy Rangareddy) మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తానని, రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని ప్రకటించి, సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్(AICC Incharge Meenakshi Natarajan) ఫోన్‌లో మాట్లాడి, ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. దీంతో మల్‌రెడ్డి ప్రెస్ మీట్‌ను వాయిదా వేశారు.

మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ మల్‌రెడ్డి రంగారెడ్డి ఇంటికి వెళ్లి సమస్యను చర్చించి, పార్టీలో యూనిటీని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌ల నుంచి ఎవరికీ మంత్రి పదవి రాకపోవడంతో, ఈ జిల్లాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ హైకమాండ్‌కు లేఖ రాసి, క్యాబినెట్‌లో ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మహేష్ కుమార్ గౌడ్ హైకమాండ్‌తో చర్చలు జరుపుతున్నారు.

Next Story