- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sridhar Babu-Jupally : కర్ణాటక సీఎంతో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి బృందం భేటీపై రేగిన రగడ!
ఉమ్మడి మహబూబ్ నగర్(Joint Mahabubnagar) తాగు, సాగునీటి(Drinking and Irrigation Water) అవసరాలకు కృష్ణా నీటి(Krishna)ని విడుదల కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah)ను కలిసేందుకు తెలంగాణ మంత్రుల డి.శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుల బృందం(Ministers Sridhar Babu and Jupally Krishna Rao Team) చేపట్టిన పర్యటనపై విపక్షాలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి

దిశ, వెబ్ డెస్క్ : ఉమ్మడి మహబూబ్ నగర్(Joint Mahabubnagar) తాగు, సాగునీటి(Drinking and Irrigation Water) అవసరాలకు కృష్ణా నీటి(Krishna)ని విడుదల కోసం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య(Karnataka CM Siddaramaiah)ను కలిసేందుకు తెలంగాణ మంత్రుల డి.శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావుల బృందం(Ministers Sridhar Babu and Jupally Krishna Rao Team) చేపట్టిన పర్యటనపై విపక్షాలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. నారాయణ పూర్ జలాశయం నుంచి 5టీఎంసీల కృష్ణా నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేయాలన్న అభ్యర్థనతో కర్ణాటక వెళ్లిన మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, జి.మధుసూధన్ రెడ్డి, మేఘారెడ్డి, పర్ణికారెడ్డి, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, మంత్రి బోసురాజులను కలిసి వినతి పత్రం అందించారు.
పాలమూరు జిల్లాకు కీలకమైన ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 17టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయని, వేసవి కారణంగా నీటి మట్టం వేగంగా డెడ్ స్టోరేజీకి పడిపోతుందని..దీంతో గద్వాల్, వనపర్తి, కొల్లాపూర్, దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వివరించారు. 30 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు మీదే ఆధారపడి ఉన్నారని తెలిపారు. వెంటనే నీటి ఎద్ధడి నివారణకు నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5టీఎంసీలు విడుదల చేయాలని వారు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను కోరారు. ఇందుకు కర్ణాటక ప్రభుత్వం 4టీఎంసీల విడుదలకు అంగీకరించినట్లుగా వారు వెల్లడించారు.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి నీటి విడుదల కోసం వినతి పత్రం అందించేందుకు మంత్రి జూపల్లి బృందం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన సందర్భంలో సిద్ధరామయ్య లుంగీపై ఉండటాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. అసలు తెలంగాణ మంత్రి, ఎమ్మెల్యేలు కర్ణాటక సీఎంను కలిసేందుకు అధికారికంగా వెళ్లారా..అధికారికంగా వెళితే రాష్ట్ర ముఖ్యమంత్రి లుంగీతో ఇతర రాష్ట్ర ప్రజాప్రతినిధులను కలుస్తారా? ..తెలంగాణ కాంగ్రెస్ మంత్రులకు కనీస గౌరవం తీసుకోవాలని ఉండదా? అంటూ విపక్ష సోషల్ మీడియా ప్రశ్నలు సంధించింది.
పొరుగు రాష్ట్రంలో ఎంత సొంత పార్టీ (కాంగ్రెస్ ) ప్రభుత్వం సీఎం ఉన్నప్పటికి ప్రోటోకాల్ మేరకు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు సహా సిద్ధరామయ్య కూడా అధికారికంగా హుందాగా వ్యవహరించాల్సిన అవసరముందని చురకలేస్తున్నారు. ఇందుకు నీటి విడుదల వినతి పత్రాన్ని సీఎం సిద్ధరామయ్య లుంగీపైనే కూర్చుని ఉండి తీసుకుంటున్న ఫోటోను వైరల్ చేస్తున్నారు. దీంతో తెలంగాణ మంత్రుల కర్ణాటక పర్యటన వ్యవహారం మరో రచ్చగా మారింది.






