- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరడుగుల మీసంతో భద్రాద్రి జిల్లా వాసి.. సెలబ్రిటీగా మారిన సూరిబాబు
ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది.

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ దాగి ఉంటుంది. కొంత మంది ఆ ట్యాలెంట్ బయటికి తీసి మంచి పేరును తెచ్చుకుంటారు. ఎన్నో అవార్డులను, రివార్డులను గెలుచుకుంటారు. కొంత మంది బుద్దిని ఉపయోగించి ఫేమస్ అయితే మరికొంత మంది శరీర దారుఢ్యాన్ని ఉపయోగించి ఫేమస్ అవుతారు. మరి కొంత మంది జట్టును, మీసాన్ని, గడ్డాన్ని, గోర్లను పెంచి పిచ్చి క్రేస్ సంపాదించుకుంటారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి తన మీసాలను పొడవుగా పెంచి తెగ ఫేమస్ అయ్యాడు. మరి ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రానికి చెందిన వనమాల సూరిబాబు.. తన ముత్తాత, తాత, తండ్రి పెంచినట్టుగానే తాను కూడా మీసాలు పెంచాడు. ఇతను సుమారుగా 20 సంవత్సరాల నుంచి తన మీసాలను కట్ చేయకుండా పెంచుతున్నాడు. దీంతో అతని మీసాలు మూడు అడుగులు చొప్పున్న పెరిగాయి. అంటే రెండు వైపులను కలుపుకుంటే ఆరడుగుల పొడవుకు చేరుకున్నాయమాట. అయితే మీసాలను పెంచేందుకు ప్రత్యేకంగా ఎలాంటి సంరక్షణ చేయడం లేదని, ఎలాంటి ఖర్చు పెట్టడం లేదని సూరిబాబు తెలిపారు. అంతలా పెరిగిన మీసాలను చూసిన వారందరూ తన దగ్గరికి వచ్చి సెలబ్రిటీతో దిగినట్టు సెల్ఫీలు దిగుతుంటే భలే మజాగా ఉందంటున్నారు సూరిబాబు.






