యాద‌గిరిగుట్ట క్షేత్రానికి అరుదైన ఘనత.. కెనడా ప్రధాని లేఖ

by Kema Shiva Kumar |

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది

యాద‌గిరిగుట్ట క్షేత్రానికి అరుదైన ఘనత.. కెనడా ప్రధాని లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ మేరకు ఆలయ సేవలను కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేకంగా అభినందిస్తూ.. ఆలయ నిర్వాహకులకు ఓ లేఖ రాశారు. కెన‌డాలోని ఒట్టవా న‌గ‌రంలో ఉన్న ల‌క్ష్మీన‌ర‌సింహా స్వామి ఆల‌యంలో క‌ల్యాణం జ‌రిపించిన తీరును ప్రశంసించారు. హిందూ సంస్కృతిలోని ఆధ్యాత్మిక‌త‌, ఐక్యతను కొనియాడారు. కాగా, ఈనెల 27 వరకు కెనడాలోని 4 రాష్ట్రాల్లో స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు. మార్క్ కార్నీ లేఖ‌పై రాష్ట్ర దేవాదాయ మంత్రి కొండా సురేఖ, ఆల‌య ఈవో వెంక‌ట్రావు అనందం వ్యక్తం చేశారు.

Next Story