మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అరుదైన గౌరవం

by Gantepaka Srikanth |

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు(Musi Project)కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్(డబ్ల్యూఎంఎఫ్) లిస్టులో చోటు దక్కింది.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు అరుదైన గౌరవం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు(Musi Project)కు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ మోనుమెంట్స్ ఫండ్(డబ్ల్యూఎంఎఫ్) లిస్టులో చోటు దక్కింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అవశ్యకతను డబ్ల్యూఎంఎఫ్ గుర్తించింది. మూసీని ప్రక్షాళన చేయకపోతే ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, సెంట్రల్ లైబ్రరీ, సిటీ కాలేజీ, మహిళా యూనివర్సిటీ, ఇతర చారిత్రక కట్టడాలకు మూసీకాలుష్యంతో ముప్పు పొంచి ఉందని పేర్కొంది. అయితే మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుతో చారిత్రక కట్టడాల పరిరక్షణకు మార్గం సుగమమవుతోందని డబ్ల్యూఎంఎఫ్ స్పష్టం చేసింది.

అయితే ఈ ప్రాజెక్టును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే మూసీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లకు సంబంధించిన మార్కింగ్ చేయడంతోపాటు ఇండ్లను కూడా ఖాళీ చేయించిన విషయం విధితమే. దీంతోపాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ పనులు కూడా జరుగుతున్నాయి. మెయిన్ హర్ట్ ఏజెన్సీతో మూసీ రివర్ ఫ్రంట్ డవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్డీసీఎల్) 4 డిసెంబర్ 2024న ఒప్పందం చేసుకుంది. ఒప్పందంపై ఇరు సంస్థలకు చెందిన ప్రతినిధులు సంతకాలు కూడా చేసిన సంగతి తెలిసిందే.

Next Story