- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీ నటి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్తులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా బుధవారం ప్రముఖ సినీనటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇక, దివ్య వాణి 2019లో టీడీపీలో చేరారు. 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి ఏ పార్టీలో జాయిన్ అవలేదు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనడంతో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. వరుస చేరికలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ సినిమా గ్లామర్ ను క్యాష్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో దివ్యవాణిని పార్టీలో చేర్చూకుంది. మరి ఆమెకు పార్టీలో ఏ స్థానం కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది.
Next Story






