ప్రాణాల మీదికి తెచ్చిన ఫోన్.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన యువకుడు

by Ramesh Goud |

ఫోన్ (phone) కోసం ఓ యువకుడు ప్రాణాల మీదికి (risked his life) తెచ్చుకున్నాడు.

ప్రాణాల మీదికి తెచ్చిన ఫోన్.. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ (phone) కోసం ఓ యువకుడు ప్రాణాల మీదికి (risked his life) తెచ్చుకున్నాడు. ఫోన్ కోసం రన్నింగ్ ట్రైన్ (running train) నుంచి దూకిన విద్యార్థి (student) తీవ్ర గాయాలపాలయ్యాడు (Seriously injured). హనుమకొండ జిల్లా (Hanumakonda district) పరకాల (Parakala)కు చెందిన అరవింద్(Aravind) అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ (Satavahana Express)లో ప్రయాణిస్తున్నాడు. ట్రైన్ లో ఫోన్ మాట్లాడుతూ.. ఫుట్ బోర్డ్(footboard) ప్రయాణం (traveling) చేస్తున్నాడు. మహబాబాబాద్ జిల్లా (Mahabubabad District), కేసముద్రం (Kesamudram) సమీపంలో అరవింద్ ఫోన్ అకస్మాత్తుగా చేతిలో నుంచి జారీ కింద పడిపోయింది. దీంతో కంగారు (shocked) పడ్డ యువకుడు హటాత్తుగా(suddenly) రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేశాడు (jumped).

దీంతో ఆ యువకుడిని తీవ్ర గాయలు అయ్యాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి వ్యక్తి పడిపోవడం గమణించిన స్థానికులు.. అంబులెన్సు (ambulance)కు, రైల్వే సిబ్బంది (railway staff)కి సమాచారం ఇచ్చారు. అనంతరం అంబులెన్స్ లో ఆసుపత్రి (hospital)కి తరలించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా (critical condition) ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా (social media)లో చక్కర్లు కొడుతోంది. వీడియోలో గాయపడిన విద్యార్థి మాట్లాడుతూ.. తన పేరు అరవింద్ అని, తనది పరకాల అని తెలిపాడు. అంతేగాక ట్రైన్ లో ఫోన్ మాట్లాడుతుండగా.. ఫోన్ కింద పడిపోయిందని, దీంతో ఫోన్ కోసం తాను కూడా దూకేసినట్లు వెల్లడించాడు.

Next Story