- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తీవ్ర విషాదం.. మందు తాగి బిర్యానీ తిని వ్యక్తి మృతి
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగి బిర్యానీ తిన్న వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఘటన కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: 2025కు టాటా చెబుతూ 2026 కు హైదరాబాద్ నగర ప్రజలు గ్రాండ్‍గా వెల్ కమ్ చెప్పారు. 31 డిసెంబర్ రాత్రి నగర వాసులు ఉత్సాహంగా గడిపారు. పబ్బులు, క్లబ్బులు, రిసార్టులు, ఫామ్ హౌస్‍లు, తమ సొంత రూమ్ లలో సరదాగా గడుపుతూ సంబరాలు చేసుకున్నారు. అయితే ఎన్నో ఆశలు, సంతోషాల మధ్య ఎంట్రీ ఇచ్చిన 2026 ఇయర్ వేడుకల్లో పలు చోట్ల తీవ్ర విషాదం నింపింది. మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పీఎస్ పరిధి భవానీనగర్ లో నిన్న రాత్రి జరిగిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించి బిర్యానీ తిని ఒకరు మృతి చెందగా మరో 16 మంది తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఈ వేడుకల్లో మొత్తం 17 మంది పాల్గొని అందరూ చిల్ అయ్యారు. వీరిలో పాండూ (53) అవే వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.






