- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pandem Kodi : కోర్టుకెక్కిన పందెం కోడి.. జడ్జి సమక్షంలోనే వేలం!
ఓ పందెం కోడి(Pandem Kodi)వివాదం ఏకంగా కోర్టుకు ఎక్కింది. సంక్రాంతి(Sankranti Kodi Pandalu) పండుగ రోజు పోలీసులకు పట్టుబడ్డ పందెం కోడిని ఏం చేాయాలన్న పంచాయితీని తేల్చేందుకు కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది.

దిశ, వెబ్ డెస్క్ : ఓ పందెం కోడి(Pandem Kodi)వివాదం ఏకంగా కోర్టుకు ఎక్కింది. సంక్రాంతి(Sankranti Kodi Pandalu) పండుగ రోజు పోలీసులకు పట్టుబడ్డ పందెం కోడి ఏం చేయాలన్న పంచాయితీని తేల్చేందుకు కోర్టుకు ఎక్కాల్సి వచ్చింది. రాజేంద్ర నగర్ పోలీసులకు సంక్రాంతి సందర్భంగా పట్టుబడిన పందెం కోడిని పోలీసులు రాజేంద్ర నగర్ కోర్టు(Rajendra Nagar Court)లో ప్రవేశ పెట్టారు. పందెం కోడి పంచాయితీ వాదనలు విన్న జడ్జి దానిని వేలం(Auction)వేయాలని నిర్ణయించారు.
జడ్జి సమక్షంలో పందెం కోడిని వేలం వేయగా.. రూ.500 నుంచి 2,500 వరకు వేలం పాట సాగింది. ఆసక్తిగా సాగిన కోడి వేలం పాటలో తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామకృష్ణ పందెం కోడిని రూ.2,500లకు సొంతం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన కథనాలు, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీసులు సైతం తాము పట్టుకున్న రెండు పందెం కోళ్లను కోర్టులో హాజరుపరిచి జడ్జీ ఆదేశాల మేరకు వేలం వేయగా ఒక పందెం కోడిని 4వేలకు, మరో పందెం కోడిని 2,500కు వేలం పాటలు కొనుగోలు చేశారు. గతంలోనూ ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన పందెం కోడిని ఆర్టీసీ అధికారులు వెలం వేసిన సంగతి తెలిసిందే.






