సీఎం ప్రజావాణి ద్వారా యువతి సౌమ్యకు కొత్త జీవితం.. రూ. 9 లక్షల ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం

by Ramesh Naini |

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం ప్రజావాణి కార్యక్రమం మరో ప్రాణాన్ని రక్షించింది.

సీఎం ప్రజావాణి ద్వారా యువతి సౌమ్యకు కొత్త జీవితం.. రూ. 9 లక్షల ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీఎం ప్రజావాణి (CM Praja Vani) కార్యక్రమం మరో ప్రాణాన్ని రక్షించింది. జనగామ జిల్లా వెంకిర్యాల గ్రామానికి చెందిన యువతి సౌమ్యకు సీఎం ప్రజావాణి ద్వారా కొత్త జీవితం లభించింది. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న సౌమ్యకు చికిత్స కోసం ప్రభుత్వం నుంచి రూ.9 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో ఆమెకు బెంగళూరులో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి, ఆరోగ్యంగా కోలుకుంది. శుక్రవారం ప్రజా భవన్‌లో జరిగిన సీఎం ప్రజా వాణి సెషన్‌లో, సౌమ్య తన తల్లిదండ్రులతో కలిసి వచ్చి.. రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డిని, రాష్ట్ర నోడల్ ఆఫీసర్ దివ్యను కలిసి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సౌమ్య మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో నాకు కొత్త జీవితం లభించింది’ అని ఆనందం వ్యక్తం చేశారు. సౌమ్య తల్లిదండ్రులు ఈర్ల శ్రీనివాస్ (చిన్న రైతు), అనురాధ (స్వయం సహాయక సంఘ సభ్యురాలు) మాట్లాడుతూ.. ‘మా కూతురి ప్రాణం నిలబడింది సీఎం ప్రజావాణి కారణంగానే. మా కుటుంబానికి అండగా నిలిచింది. ప్రభుత్వ సహాయం ఎప్పటికీ మేము మర్చిపోలేము’ అని అన్నారు. ఈ సందర్భంగా, డాక్టర్ చిన్నారెడ్డి, దివ్య సౌమ్యకు రూ.4 లక్షల CMRF చెక్కును అందజేయగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (SERP) అదనంగా రూ.5 లక్షలను ఆర్థిక సహాయంగా అందించింది.

Next Story