బీఆర్ఎస్ నేతకు తృటిలో తప్పిన ప్రమాదం

by Disha Web Desk 14 |
బీఆర్ఎస్ నేతకు తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బీఆర్ఎస్ నేత స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఖైర‌తాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న త‌న మిత్రుడిని ప‌రామ‌ర్శించి ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా.. కొత్తపేట క్రాస్ రోడ్డు సమీపంలో టైరు పగిలిపోవడంతో అదుపు తప్పింది.

దీంతో వాహనం పక్కనున్న మెట్రో పిల్లర్‌ డివైడర్‌ను ఢీకొట్టింది. వెంటనే కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పల్లె రవికుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారులో ఆయనతో పాటు మిత్రుడు రాజు, డ్రైవర్ ఖదీర్ స్వల్ప గాయాలయ్యాయి.



Next Story

Most Viewed