MLC candidate : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం

by Y. Venkata Narasimha Reddy |

ఎన్నికల ప్రచారానికి వెలుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC Candidate) యాదగిరి శేఖర్ రావు(Yadagiri Sekhar Rao)కు తృటిలో భారీ రోడ్డు ప్రమాదం(Road accident)తప్పింది.

MLC candidate : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ఎన్నికల ప్రచారానికి వెలుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి(Graduate MLC Candidate) యాదగిరి శేఖర్ రావు(Yadagiri Sekhar Rao)కు తృటిలో భారీ రోడ్డు ప్రమాదం(Road accident)తప్పింది. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లా కోరుట్ల సాయిబాబా గుడి వద్ద లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో యాదగిరి శేఖర్ రావుకు స్వల్ప గాయాలవ్వగా వెంటనే అనుచరులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసమైంది. నిజామాబాద్‌లో ప్రచారం ముగించుకొని కరీంనగర్ వైపు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 29న ఖాళీ కాబోతున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి 3న ఈసీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 27న పోలింగ్‌ నిర్వహించి.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.

మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండింటితో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15మంది అభ్యర్థులు, పట్టభద్రుల నియోజకవర్గంలో 56మంది పోటీ చేస్తున్నారు. ఇందులో 10మంది వివిధ పార్టీల నుంచి పోటీ పడుతుండగా..46మంది స్వతంత్ర అభ్యర్థులు కావడం గమనార్హం. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 19మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Next Story