- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30గుంటల భూమి కోసం తల్లి ప్రాణం బలి
ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కసాయి బిడ్డ!

30గుంటల భూమి కోసం తల్లి ప్రాణం బలి
- ఆస్తి కోసం కన్న తల్లిని చంపిన కసాయి బిడ్డ!
- భర్తతో కలిసి తల్లిని హతమార్చిన కూతురు
- జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో కలకలం
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తి మండలం కొండాపురం పెద్గతండాలో ఘోర హత్య జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లినే కూతురు భర్తతో కలిసి హతమార్చిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. బాధావత్ లక్ష్మీ (45) భర్త తిరుపతి సుమారు 20 ఏళ్ల క్రితం మరణించగా, లక్ష్మీ కూలీ పనులు చేస్తూ తన ఏకైక కూతురు సంగీతను పెంచింది. పెళ్లి కోసం రెండు ఎకరాల భూమి అమ్మి కట్నకానుకలు ఇచ్చింది. 20 గుంటలు ఆడపడుచులకు రాసిచ్చింది. మిగతా 30 గుంటల భూమిని తన జీవనోపాధి కోసం తన పేరుతో ఉంచుకుంది. ఇక కూతురు సంగీత, అల్లుడు వీరన్న కొంతకాలంగా "ఆ భూమిని మా పేరుమీద రాసివ్వాలి" అంటూ పదేపదే గొడవపెట్టుకున్నారు. అయితే లక్ష్మీ "నేను బ్రతికున్నంత వరకు ఆస్తి ఎవరికీ రాయను" అని గట్టిగా చెప్పడంతో పగ పెంచుకున్నారు. మంగళవారం అర్థరాత్రి లక్ష్మీ నిద్రలో ఉండగా, కూతురు–అల్లుడు కలిసి దిండు పెట్టి ఊపిరాడనివ్వకుండా హతమార్చారు. బుధవారం ఉదయం ఆమె కూలిపనులకు రాలేదని అనుమానంతో పొరుగువారు ఇంటికి వెళ్ళగా, లక్ష్మీ మృతదేహం కనిపించడంతో పోలీసులు సమాచారం అందుకున్నారు. దర్యాప్తులో కూతురు, అల్లుడు పథకం ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.






