- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD మేయర్ విజయలక్ష్మికి తప్పిన ప్రమాదం (వీడియో)
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(HYD Mayor Vijayalakshmi)కి పెను ప్రమాదం(Accident) తప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(HYD Mayor Vijayalakshmi)కి పెను ప్రమాదం(Accident) తప్పింది. సుందరీకరణ పనుల్లో భాగంగా నగరంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా.. పంజాగుట్ట నాగార్జున సర్కిల్(Panjagutta Nagarjuna Circle) వద్ద స్ట్రీట్ లైట్ పోల్ తగిలి కింద పడింది. దీంతో ఆమెకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే అప్రమత్తమైన అధికారులు, కాంగ్రెస్ నేతలు ఆమెను పైకి లేపారు. కాగా, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ఉదయం శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని పలు డివిజన్లలో ఆకస్మికంగా పర్యటించారు. చందానగర్ సర్కిల్ పరిధిలోని హఫీజ్ పేట్ డివిజన్‌లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ పూజిత, జగదీశ్వర్ గౌడ్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించారు. నూతనంగా వేస్తున్న రోడ్ల నాణ్యతను పరిశీలించారు. అలాగే ఆయా కాలనీలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.






