- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ST ఎమ్మెల్యేలకు మంత్రి సీతక్క కీలక పిలుపు
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సీతక్క, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Naik) ఆధ్వర్యంలో ఎస్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు(Telangana ST MLAs) సమావేశం అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో మంత్రి సీతక్క, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Naik) ఆధ్వర్యంలో ఎస్టీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు(Telangana ST MLAs) సమావేశం అయ్యారు. పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గిరిజన, ఆదివాసీల సంక్షేమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీతక్క(Minister Seethakka) మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత వెనుకబడ్డ జాతులు గిరిజనులే అన్నారు. మన అభివృద్ధికి ఐకమత్యంతో కలిసి పని చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎస్టీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. నివేదిక ఆధారంగా బడ్జెట్లో ప్రత్యేక పథకాలు రూపొందించుకుందామని చెప్పారు.
సమాజానికి దూరంగా ఉన్న మన జాతుల అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామని అన్నారు. గిరిజన సంక్షేమాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గిరిజన సంక్షేమం మీద ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గత పది సంవత్సరాల్లో గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. కనీసం పోడు భూముల సమస్యలను కూడా పట్టించుకోలేదని అన్నారు. ఇందిరా జలప్రభ వంటి పథకాలకు నీళ్లు కేటాయించకుండా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. గిరిజన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎస్టీ ఎమ్మెల్యేల సమావేశంలో చర్చించిన అంశాలను సీఎంకు నివేదిస్తామని హామీ ఇచ్చారు.
రేపే ముఖ్యమంత్రితో ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతామని అన్నారు. సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల కోసం రూ. 2 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గిరిజన పాఠశాలలో, తండాల్లో సేవాలాల్ జయంతి ఉత్సవలను Februray 15న ఘనంగా నిర్వహించుకుందామని చెప్పారు. గిరిజన పాఠశాలల్లో, వసతి గృహాల్లో తాగునీరు, టాయిలెట్ల నిర్మాణం, భవనాల నిర్మాణం కోసం రూ. 250 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే పనులు ప్రారంభించాలని ఆదేశించారు. గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు, హాస్టల్లో సిబ్బంది ఖాళీల జాబితాను సమర్పించండని సూచించారు. సీఎంతో చర్చించి పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెడతామని అన్నారు.






