- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రక్షణ కల్పించాలని సీపీని ఆశ్రయించిన ప్రేమ జంట..
ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు రక్షణ కరువవడంతో జిల్లా పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు.

దిశ, ఆర్మూర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంటకు రక్షణ కరువవడంతో జిల్లా పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన మేజర్ అయిన నితీష్ (23) నిహారిక(20) గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇరువురు మేజర్ అవడంతో నిజామాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో ఈ నెల 15న వివాహం చేసుకున్నట్లు తెలిసింది. నిహారిక తల్లిదండ్రులు, వారి బంధువులు నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రేమ జంట ఇటీవల నందిపేట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
అక్కడ తమకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు. ఆర్మూర్ డీఎస్పీ కార్యాలయానికి వెళ్ళగా డీఎస్పీ అందుబాటులో లేకపోవడంతో గురువారం సీపీ కార్యాలయానికి వెళ్లినట్లు శుక్రవారం తెలిసింది. తమకు తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సీపీని ప్రేమజంట వేడుకుంది. పోలీస్ కమిషనర్ నాగరాజు వారి రక్షణ కోసం మహిళా పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేశారు.
ఇవి కూడా చదవండి: పొంగులేటి వర్గానికి బిగ్ షాక్.. ఆ ముగ్గురు నేతల సెక్యూరిటీ తగ్గింపు






