- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిమ్స్ లో ఒక ‘లేఖ’ కలకలం..!
నిమ్స్ లో మీడియాపై నిషేదాజ్ఞలు విధించాలని, మీడియాకు సమాచారాన్ని చేరవేస్తున్న తన విభాగంలోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఓ వైద్యాధికారి నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ కు లేఖ రాయడం దుమారం లేపింది

నిమ్స్ లో ఒక ‘లేఖ’ కలకలం..!
దిశ ఖైరతాబాద్ : నిమ్స్ లో మీడియాపై నిషేదాజ్ఞలు విధించాలని, మీడియాకు సమాచారాన్ని చేరవేస్తున్న తన విభాగంలోని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఓ వైద్యాధికారి నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ కు లేఖ రాయడం దుమారం లేపింది. నిమ్స్ అనధికారికంగా గోప్యమైన సమాచారాన్ని కొందరు మీడియాకు పంపిస్తున్నారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. నిమ్స్ లో గోప్యమైన సమాచారాన్ని మీడియాకు కొందరు సిబ్బంది అందిస్తున్నారని, మీడియాపై నిషేదాజ్ఞలు విదించాలని కోరడం వెనుక ఉన్న అంత్యమేమిటో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటి వరకు మీడియాకు చేరిన గోప్యమైన సమాచారం ఏమిటీ, ఎవరు చేర్చారు, ఎలా చేర్చారన్నది సదరు అధికారి స్పష్టంగా చెప్పలేదని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపలేదని మెడికల్ సూపరింటెండెంట్ డైరెక్టర్ కు రాసిన మరో లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రజల ఆస్పత్రిగా ఉన్న నిమ్స్ లో గోప్యమైన సమాచారం ఏముంటుంది..? ప్రజలకు వారధిగా నిలిచే మీడియాపై నిషేదాజ్ఞలు విదించాలని ఎందుకు చూస్తున్నారు..? ప్రస్తుతం ఈ నిమ్స్ ' లేఖ ' చర్చనీయాంశంగా మారింది.






