Telangana Thalli: ట్యాంక్‌బండ్‌పై జన నీరాజనం! విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు

by Ramesh Naini |

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని మంత్రులు, అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

Telangana Thalli: ట్యాంక్‌బండ్‌పై జన నీరాజనం! విగ్రహ ఆవిష్కరణకు పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని మంత్రులు, అధికారుల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అయితే, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీంతో సచివాలయం, ట్యాంక్ బండ్ పరిసరాలు జనసంద్రంగా మారాయి. విగ్రహ ఆవిష్కరణ విజువల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని దూరం నుంచే ప్రజలు తమ ఫోన్‌లల్లో ఫోటోలు తీస్తూ ఖుష్ అవుతున్నారు.

కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజుల పాటు ట్యాంక్‌బండ్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. నేటితో ఈ విజయోత్సవాలు ముగిశాయి.

Next Story