జగద్గిరిగుట్టలో పట్ట పగలు యువకునిపై కత్తితో దాడి

by Prasad Jukanti |   (  Updated:2025-11-05 12:11:32  IST  )

జగద్గిరిగుట్ట బస్టాండ్ లో దారుణం జరిగింది.

జగద్గిరిగుట్టలో పట్ట పగలు యువకునిపై కత్తితో దాడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) పట్టపగలు దారుణం జరిగింది. బస్టాండ్‍ వద్ద యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో రషీద్ అనే యువకుడిపై బాల్ రెడ్డి, మరో యువకుడు దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన రషీద్ కు తీవ్ర రక్తస్రావం అయింది. అయితే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న బస్టాండ్ ప్రాంతంలో కత్తి దాడితో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ ఘనటలో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యాయి. కాగా రషీద్, బాల్ రెడ్డి ఇద్దరు స్నేహితులు అని, ఆర్థిక లావాదేవీలే ఈ దాడికి కారణం అని తెలుస్తోంది.

Next Story