రీజనల్ రింగ్ రోడ్డుపై కిషన్ రెడ్డి బిగ్‍అప్ డేట్

by Prasad Jukanti |

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్డు, రైల్వే పనుల పురోగతిని వివరించారు.

రీజనల్ రింగ్ రోడ్డుపై కిషన్ రెడ్డి బిగ్‍అప్ డేట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో ప్రధాన మంత్రి రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి హాజరుకాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆ తర్వాత అభివృద్ధి పైనే మా గురి అన్నారు. రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్, కాంగ్రెస్, డీఎంకే ఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. ఇవాళ హెచ్ఐసీసీలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మాట్లాడిన కిషన్ రెడ్డి.. మూడేళ్ల క్రితమే రీజినల్ రింగ్ రోడ్డు పనులకు కేంద్రం అంగీకరించిందని కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తవుతాయన్నారు. మోడీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. 2014 కు ముందు తెలంగాణలో 2400 జాతీయ రహదారులు ఉంటే ఈ 11 ఏళ్లలో సుమారు 2600 జాతీయ రహదారులు పెరిగాయన్నారు. కేంద్రం పెద్ద ఎత్తున జాతీయ రహదారులపై ఖర్చు చేస్తోందన్నారు. అలాగే రైల్వే నెట్ వర్క్ తెలంగాణలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సుమారు 42 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు.

Next Story