- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జనగణనలో కీలక అడుగు.. ఏప్రిల్ నుంచి హౌస్లిస్టింగ్
జనాభా లెక్కల్లో మరో కీలక ఘట్టానికి అడుగుపడింది. జనగణన చేసే హౌస్లిస్టింగ్సర్వేను వచ్చే ఏప్రిల్1 నుంచి సెప్టెంబర్30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జనాభా లెక్కల్లో మరో కీలక ఘట్టానికి అడుగుపడింది. జనగణన చేసే హౌస్ లిస్టింగ్ సర్వేను వచ్చే ఏప్రిల్1 నుంచి సెప్టెంబర్30 నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్విడుదల చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆరు నెలల్లో హౌస్లిస్టింగ్ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలు వారికి అనుకూలమైన సమయంలో 30 రోజుల పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో చేస్తారు. ప్రతి రెవెన్యూ గ్రామాన్ని మ్యాపింగ్చేస్తారు. కుటుంబానికి, ఇంటి యజమాని వివరాలను సేకరిస్తారు. సర్వేలో ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులను భాగస్వాములు చేయనున్నారు. జూలై నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్పటి వరకు హౌస్లిస్టింగ్ సర్వేను పూర్తిచేస్తారు. రాష్ట్రంలో 75వేల బ్లా్క్ ల ద్వారా జనగణన చేయాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. 90వేల మంది వరకు టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు అవసరమవుతారని అంచనా వేశారు. పర్యవేక్షణకు మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులను వినియోగించుకోనున్నారు. వీరందరికీ వచ్చేనెల నుంచి శిక్షణ ఇవ్వనున్నారు. ముందుగా రాష్ట్ర అధికారులు, ఆ తర్వాత జిల్లా ఆఫీసర్లు, ఆ తర్వాత ఎన్యుమరేట్లకు శిక్షణ ఇస్తారు.
సెల్ఫ్ఎన్యుమరేషన్కు ఛాన్స్
సెల్ఫ్ఎన్యుమరేషన్కు అవకాశం కల్పిస్తారు. అయితే సర్వే ప్రారంభానికి 15 రోజుల ముందుగానే సెల్ఫ్ఎన్యుమరేషన్ను అధికారులు ప్రారంభిస్తారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలను అందించవచ్చు. వారి వివరాల ఆధారంగా ఆ ఇంటిని అధికారులు ఎన్యుమరేషన్లెక్కల్లో తీసుకోరు. డబుల్ఎంట్రీ కాకుండా ఈ చర్యలు తీసుకోనున్నారు.
రూ.11,718 కోట్ల బడ్జెట్
ఈ జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నారు. మొబైల్ యాప్‌ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తే స్వీయ గణనకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం 30లక్షల మంది సిబ్బందిని నియమించగా.. రూ.11,718 కోట్ల బడ్జెట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో భాగంగానే కుల గణన చేయనున్నారు. ఇదిలావుంటే.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
Read More..






