BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం

by Satheesh |
BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ స్టేట్ పాలిటిక్స్‌లో సంచలనం రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో దూకుడు పెంచిన పోలీసులు.. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మార్చి 10న ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ఆరుగురిని నిందితులుగా చేర్చారు. తాజాగా కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీట్‌లో ఈ విషయాలను పేర్కొన్నారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, రియల్టర్లు, వ్యాపారస్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు వెలుగులోకి రావడంతో ఈ ఇష్యూని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుుకుంది. ఈ మేరకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, సస్పండెడ్ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు, సస్పెండెడ్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఈ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారమే పోలీసులతో రివ్యూ నిర్వహించారు. సీఎం అధికారులతో భేటీ అయిన మరుసటి రోజే పోలీసులు ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్ షీట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ అయిన అధికారులు.. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని సుప్రీం ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు చెప్పడంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed