440 మార్కులకు 434...కానీ ఈ ఇంటర్ విద్యార్థిని చేసిన పని చూడండి !

by velandi.Saikiran |

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ( Telangana Intermediate Exam Results) ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే.

440 మార్కులకు 434...కానీ ఈ ఇంటర్ విద్యార్థిని చేసిన పని చూడండి  !
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ( Telangana Intermediate Exam Results) ఇవాళ విడుదలైన సంగతి తెలిసిందే. తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ( Bhatti Vikramarka) ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల నేపథ్యంలో... కొంత మంది విద్యార్థులు భారీగా మార్కులు తెచ్చుకొని పాస్ అయితే.. కొంతమంది యావరేజ్ మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మరికొంతమంది... పరీక్షలు తప్పారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్టియర్ లో ( Inter first year)... 66.89 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అలాగే సెకండియర్ లో 71.37% ఉత్తీర్ణత సాధించారు. అయితే పాస్ అయిన వారు సంబరాలు చేసుకుంటుంటే... ఫెయిల్ అయిన విద్యార్థులు బాధపడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఓ ఇంటర్ విద్యార్థిని కూడా ఫెయిల్ అయినందుకు ఆత్మహత్య కూడా చేసుకుంది. ఇలాంటి నేపథ్యంలో ఓ ఇంటర్ విద్యార్థిని వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వాస్తవానికి ఆమె ఇంటర్ ఫెయిల్ కాలేదు. 440 మార్కులకు 434 మార్కులు తెచ్చుకొని టాప్ లేపేసింది. అంటే స్టేట్ లెవెల్ లోనే ఆమె తోపు స్టూడెంట్ అన్నమాట. అలాంటి ఆ లేడీస్ స్టూడెంట్... 434 మార్కులు వచ్చినా కూడా బోరున అవిలపించింది. మిగిలిన 6 మార్కుల కోసం... అన్నం తినకుండా ఏడ్చేసింది. తల్లిదండ్రులు... ఎంత ఓదార్చిన అస్సలు ఊరుకోలేదు. ఆ 6 మార్కులు కావాల్సిందే అంటూ మారాం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోని చూసి నెటిజన్స్.. మీరెక్కడ దొరికార్రా నాయనా? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.


Next Story